PS -1 : రెమ్యూన‌రేష‌న్ భారీగానే..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ తో పాటు కుమారవేల్, జయ మోహన్ లు సంయుక్తంగా కథను అందించారు. 1955 లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కించార‌ట‌. రెండు భాగాలుగా వచ్చే ఈ చిత్రం.. మొదటి భాగం ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాశ్ రాజ్ తో పలువురు నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

అయితే పొన్నియిన్ సెల్వన్ లో కనిపించే వారు అందరూ స్టార్లు కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ స్టార్ నటీ నటులు పొన్నియిన్ సెల్వన్ కోసం ఎంత వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే దానిపై కూడా చాలా మంది నుండి ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా సినీ సర్కిల్స్ లో పొన్నియిన్ సెల్వన్ నటీ నటుల రెమ్యునరేషన్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.

పొన్నియిన్ సెల్వన్ లో ప్రధాన పాత్ర చేస్తున్న చియాన్ విక్రమ్ అత్యధికంగా రూ. 15 కోట్లు తీసుకుంధంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ. 10 టున్నారు. అదేవికోట్లు, జయం రవి 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు, త్రిష రూ. 2 కోట్లు తో పాటు ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య లక్ష్మీ ఒక్కొ కోటీ తీసుకున్నారని తెలుస్తోంది. అంటే ప్రధాన తారాగణానికే రూ. 42 కోట్ల వరకు అయింది. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంత భారీ బడ్జెట్ తో  వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు లాభం తెస్తుందో నష్టాలను తీసుకొస్తుందో వేచి చూడాలి మరీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు