Pawan : అన్నయ్య కోసం..

ఆచార్య పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మలయాళంలో వచ్చిన లూసిఫర్ కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

దీని కోసం ప్రమోషన్లను భారీగా చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్లు విడుదలైయ్యాయి. ఇవి ప్రేక్షకులపై పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. దీంతో ప్రమోషన్లను మరింత దూకుడుగా చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ లో మరొక స్టార్ హీరోను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకురావాలరి మేకర్స్ భావిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా తీసుకురావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ ఈవెంట్ కు పవర్ స్టార్ వస్తే సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుంది. దీంతో మూవీ యూనిట్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు