Hanuman: అంజనాద్రి… వినగానే ఏదో గుర్తొస్తుంది కదూ..

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “హనుమాన్”. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా గత సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడి ఫైనల్ గా ఇప్పుడు 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసారో అప్పట్నుంచి హనుమాన్ కోసం ఆడియన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టు పాటలు కూడా బాగుండి మెప్పించాయి.

అయితే రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని మెప్పించగా, అక్కడక్కడా VFX విషయంలో మాత్రం కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్ స్టార్ట్ అయ్యేటపుడు చూసిన ఒక పేరు విషయంలో మాత్రం తెలుగు ఆడియన్స్ ఒక రకంగా భయపడుతున్నారు. లాస్ట్ ఇయర్ బాగా వైరల్ అయిన ఆ పేరుకు ఈ పేరుని లింక్ చేసి, ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.

ఇంతకీ అదేంటంటే హనుమాన్ ట్రైలర్ స్టార్ట్ అయ్యే ముందు “అంజనాద్రి” అంటూ ఓ కొండ ప్రాంతాన్ని చూపిస్తూ మొదలవుతుంది. ఆ తరువాత ట్రైలర్ మొత్తం ఆ కొండ పరిసర ప్రాంతాల్ని చూపిస్తూ స్టోరీ నేరేట్ చేసారు. అయితే సరిగ్గా రెండేళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చింది. ఆ సినిమా కథ మొత్తం ఒక కొండ ప్రాంతమైన సిద్ధవనం లో ‘పాదఘట్టం’ చుట్టూనే తిరుగుతుంది. ఇక సినిమా రిజల్ట్ ఏమయిందో మనందరికీ తెలిసిందే. సినిమా డైరెక్టర్ కథ విషయం లో పెట్టిన శ్రద్ధ కంటే పాదఘట్టం పై పెట్టిన ఫోకస్ ఎక్కువయిందని, సినిమాలో హీరోల కంటే కూడా ఎక్కువగా పాదఘట్టం పేరే వినాల్సి వచ్చింది.

- Advertisement -

ఇప్పుడు హనుమాన్ ట్రైలర్ చూస్తుంటే కూడా కొందరు ఆడియన్స్ కి అదే గుర్తొస్తుంది. అంజనాద్రి పేరు, ఆ కొండ.. ఈ రెండింటిని పాదఘట్టానికి లింక్ చేసి ఆడియన్స్ ని భయపెడుతున్నారు మేమెర్స్. అయితే ట్రేడ్ విశ్లేషకులు మాత్రం కంటెంట్ బాగుంటే ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు జనాలు అంటున్నారు. మరి హనుమాన్ అంజనాద్రి కొండపైకి మనందరినీ తీసుకెళ్తారా, లేక ప్రశాంత్ వర్మ మరో పాదఘట్టం చూపిస్తాడా అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు