Rashmika Mandanna: పాప ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టుంది… పిక్ వైరల్

Rashmika Mandanna: అరెరే… రష్మిక మందన్న పాపం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టుందే అనిపిస్తుంది ఆమె తాజాగా షేర్ చేసిన ఒక పిక్ చూస్తుంటే. కల నెరవేరింది అంటూ రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ “యానిమల్” బ్యూటీ గ్లామర్ పరంగా చూపిస్తున్న వైల్డ్ యాంగిల్ చూసి ఆమె అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యి నెల గడుస్తున్నప్పటికీ ఇంకా బయటపడనట్టు కనిపిస్తోంది రష్మిక. సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక ఒదిగిపోయిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రష్మిక “ఒక్కొక్కసారి ఉన్నచోటే ఆగిపోయి అరెరే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అని ఆలోచిస్తూ ఉంటాం.

కానీ ఇదంతా జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను కలలు కన్నది సంతోషం, ఆనందం, మనశ్శాంతి గురించి. కానీ దేని గురించో తెలియకుండానే పరిగెడుతూ ఉండేదాన్ని. కానీ సరైన మనుషులతో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఇదే కదా కావాలనుకుంది అని గుర్తిస్తాం. నేను చిన్నప్పటి నుంచి కంటున్న కల ఇదే” అంటూ ఒక స్ట్రీట్ లో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసింది రష్మిక. అయితే ఆమె ఈ ఫోటో ఎక్కడ దిగింది అనే విషయం పెద్దగా తెలియదు కానీ రష్మిక షేర్ చేసిన ఫోటో పై మాత్రం సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

ఆ పిక్ లో రష్మిక ఫుల్ హాండ్స్ ఉన్న జాకెట్ ధరించి, పొట్టి షాట్ వేసుకుంది. అదంతా చూస్తుంటే రష్మిక ప్యాంటు వేసుకోవడం మర్చిపోయింది అని అనిపిస్తోంది. బాలీవుడ్ కు వెళ్ళాక ఈ బ్యూటీకి అక్కడ నీరు బాగా ఒంటబట్టినట్టుంది. అందుకే బాలీవుడ్ హీరోయిన్లను మించి పోయేలా ఇలా చిట్టి పొట్టి బట్టలు ధరించి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. కానీ రష్మిక షేర్ చేసిన ఈ పిక్ ను చూసి ఓ వర్గం అభిమానులు హర్ట్ అవుతున్నారు.

ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది కదా అయినా మరీ ఇలాంటి బట్టలు ధరించడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా పీక్స్ లో స్టార్ డంను అందుకుని ఎంజాయ్ చేస్తోంది రష్మిక. మరోవైపు ఈ బ్యూటీకి, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు మధ్య ఏదో ఉంది అంటూ రోజుకో రూమర్ బయటకు వస్తోంది. అయితే వీళ్ళిద్దరూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతూ తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు