Hi Nanna: పెళ్లైన హీరోతో ప్రేమలో పడ్డ సీత..? నెట్టింట్లో హల్‌చల్

సినిమా రంగంలో పుట్టగొడుగుల్లా పుకార్లు వస్తుంటాయి. ఇలాంటి పుకార్ల వల్ల హీరో హీరోయిన్లు, అలాగే వాళ్ల కుటుంబ సభ్యులు పర్సనల్ గా ఎంత బాధపడుతుంటారు. కానీ కొంత మంది గాసిప్ రాయుళ్లు తమ సోషల్ మీడియాల్లో ఇష్టరాజ్యంగా పుకార్లను వ్యాప్తి చేస్తారు. ఇలా పుకార్లను పుట్టించడంలో బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు మొదటి వరసలో ఉంటాడు. హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలను బహిరంగంగా మాట్లాడే ఉమైర్ సంధు.. పుకార్లను వ్యాప్తి చేయడంలోనూ ముందు ఉంటాడు.

తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రతి రోజు ఏదో ఒక సెలబ్రెటీపైన, వారి పర్సనల్ విషయాలపై ట్వీట్స్ వేస్తుంటాడు. అవి చాలా సార్లు బెడిసి కొట్టి లీగల్ నోటీసుల వరకు వెళ్లాయి. ఇప్పటికే బాలీవుడ్ ఐటెం బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఒక సారి లీగల్ నోటీసులు పంపించగా, తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులను పంపించింది. అయినా, ఈ గాసిప్ రాయుడు ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా మరో హీరోయిన్, హీరో గురించి తప్పుగా మాట్లాడుతూ ట్వీట్ వేశాడు. సీతారామం సూపర్ హిట్ కొట్టి తెలుడు ఆడియన్స్ ద్రుష్టిలో సీతగా నిలిచిపోయిన మృణాల్ ఠాకుర్ ను ఈ సారి టార్గెట్ చేశాడు ఉమైర్. మృణాల్ పెళ్లైన హీరోతో ప్రేమలో పడింది అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రేమ మాత్రమే కాదు.. వీరి ఇద్దరి మధ్య ఎఫైర్ కూడా నడుస్తుంది అంటూ ట్వీట్ చేశాడు.

- Advertisement -

ఆ హీరో ఎవరో కాదు.. ఇటీవల దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని. మృణాల్ – నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారని ఉమైర్ తన ట్విట్టర్ తో వెల్లడించారు. కాగా, ఉమైర్ సంధు చెప్పేవి అన్నీ కూడా అబద్ధాలే అని అందరికీ తెలుసు. గతంలో సమంత, విజయ్ దేవరకొండ తో పాటు చాలా మంది నటీనటుల మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ ట్వీట్స్ వేశాడు. కాగా, ప్రస్తుతం మృణాల్, నాని మధ్య ఎఫైర్ అని వేసిన ట్వీట్ కి ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు