Salaar : ఆ స్టార్ హీరో డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా- నిజమెంత ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా గురించిన ఒక న్యూస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రభాస్ నాలుగు సినిమాలు సెట్స్ పై ఉండగా మరో సినిమా గురించిన అప్డేట్ రావడంతో ప్రభాస్ అభిమానులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం కల్కి,సలార్ 1&2, రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్ ) ఈ నాలుగు సినిమాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలన్నీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలు దేనికదే వైవిధ్య భరితమైన సినిమాలు కాగా వీటిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

సలార్, కల్కి సినిమాలైతే దాదాపు షూటింగ్ పార్ట్ ను కూడా కంప్లిట్ చేసుకొని, ఆల్రెడీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా డిస్కషన్స్ లో ఉంది. ఇంతవరకు ఈ సినిమాపై ఏ క్లారిటీ పూర్తిగా రాకుండానే మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక న్యూస్ వైరల్ అవుతోంది.

- Advertisement -

సోషల్ మీడియా రూమర్ల ప్రకారం… ప్రభాస్ మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీ రాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నాడట. ఇటీవలనే పృథ్వీ రాజ్, ప్రభాస్ కు కథ కూడా వినిపించగా ఆయన ఆలోచిస్తానని చెప్పాడట. సలార్ తరహాలో ఉండే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ ను పృథ్వీ రాజ్, ప్రభాస్ కు చెప్పాడని టాక్.

వీరిద్దరూ కలిసి ప్రస్తుతం సలార్ సినిమాలో కలిసి నటిస్తుండగా ఆ సినిమా షూటింగ్ లోనే ఈ ఇద్దరు హీరోలు మంచి ఫ్రెండ్స్ అవ్వగా..ప్రభాస్ ఈ సినిమాకు ఓకె చెప్పే సూచనలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు