VD12: చివరి నిమిషంలో విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఇటీవల లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీతో ఇండియా లెవెల్ లో హల్చల్ చేద్దామనుకున్నాడు. కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడు రూట్ మార్చాడు. యాక్షన్ సినిమాలను పక్కన పెట్టి లవ్ స్టోరీలు చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇంతలో మరో లవ్ స్టోరీ తో రెడీ అయిపోయాడు విజయ్. గత నెల చాలా సైలెంట్ గా తన 12వ సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఓ పిరియాడికల్ డ్రామా సినిమాకి ఓకే చేశాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు పూజ హెగ్డే ని అనుకున్నారట. కానీ ఆ తరువాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకి కమిట్ అయినప్పుడు ఓ రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న మృణాల్..

- Advertisement -

ఆ తరువాత అధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దానికి కారణం ఈ సినిమాలో విజయ్ తో లిప్ లాక్ సన్నివేశాలు ఉండడమేనని తెలుస్తోంది. దీంతో ఏరి కోరి మరి ఈ ముద్దుగుమ్మని సెలెక్ట్ చేసుకున్న విజయ్ దేవరకొండ కి షాక్ తగిలింది. ఇలా చివరి నిమిషంలో మృణాల్ ప్లాన్ మార్చేయడంతో విజయ్ తీవ్ర డిసప్పాయింట్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేం లేక ఆమెని తీసేసి మళ్లీ పూజా హెగ్డేని పెట్టుకుంటారట. చూడాలి మరి రెమ్యూనరేషన్ విషయంలో మృణాల్ సర్దుకుంటుందా..? లేక పూజా హెగ్డేని సెలక్ట్ చేస్తారా..? అన్నది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు