Happy Birthday: కోట శ్రీనివాసరావు.. విలక్షణ నటనకి మారుపేరు

టాలీవుడ్ లో ఎంతో మంది నటులు అవుదామని వస్తారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరు ఓడిపోతారు, మరి కొందరు గెలుస్తారు. కానీ అందులో చాలా తక్కువ మందే ది బెస్ట్ అనిపించుకొంటారు. అలా ప్రేక్షకులు అనాలంటే ఆ వ్యక్తిలో ఎవ్వరికి లేని ప్రత్యేకత ఉండాలి. ఏ పాత్రైనా చేయగలిగే సామర్థ్యం, ఆ పాత్రలో ఒదిగిపోయే తత్వం ఉండాలి. అలాంటి అతి కొద్ది మంది నటుల్లో ఒకరు “కోట శ్రీనివాసరావు”. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకి filmify టీమ్ తరపున బర్త్ డే విషెస్ తెలియచేస్తూ కోట శ్రీనివాసరావు గురించి కొన్ని ప్రత్యేక విశేషాలు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో అద్భుతమైన విలనిజాన్ని పండించే నటుల్లో మొదట గుర్తొచ్చే పేర్లు రాజనాల, రావు గోపాల్ రావు. అయితే వీళ్ళ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ  నటనలో వీళ్ళకే పోటీ వచ్చే స్థాయికి ఎదిగిన నటుడు కోటశ్రీనివాసరావు. ప్రాణం ఖరీదు తో మొదలైన ఈయన నట ప్రస్థానం ఇప్పటికీ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ఒక్క విలన్ గానే కాదు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు.

పిసినారి లక్ష్మీపతి గా, మాయలోడి అప్పలకొండగా, ఎస్ ఐ తాడి మట్టయ్యగా, పోతురాజు గా అద్భుతమైన హాస్యాన్ని పండించిన ఆయన, అనేక చిత్రాల్లో ప్రతినాయకుడిగా విలక్షణ పాత్రలు పోషించారు. ముఖ్యంగా గణేష్ సినిమాలో హోమ్ మినిష్టర్ పాత్రకి ఆరోజుల్లో ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఉండేది.

- Advertisement -

గత పదేళ్ల కిందటి వరకు ఒక సినిమాలో సగటు తండ్రి పాత్రైనా, ఒక బాబాయ్ పాత్రైనా, మామ పాత్రైనా, లేదా ఓల్డ్ ఫ్రెండ్ పాత్రైనా ఆయనే కేరాఫ్ గా ఉండేవారు. “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” సినిమాలో వెంకటేష్ కి మిడిల్ క్లాస్ సగటు తండ్రిగా ఆయన పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. బహుశా అతి తక్కువ మందికి ఇలాంటి పాత్రలు లభిస్తాయి. ఈ రోల్ కోట శ్రీనివాసరావు ని చూసిన ప్రేక్షకులు ఆయన చనిపోయే సీన్ లో కంటతడి పెట్టక మానరు.

టాలీవుడ్ లో తన మార్క్ మేనరిజం తో ప్రత్యేకంగా ఆకట్టుకునే కోట.. పలు డైలాగులతో ట్రెండ్ సెట్ చేసారు. అందులో మచ్చుకు కొన్ని..

వీడెవడండీ బాబు..
నాకేంటి.. అః.. నాకేంటి అని..
నీయబ్బ.. ఇరగదీస్తా..
ఏం తమ్మి.. మంచిగున్నవా

ఉత్తమ సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా కూడా పలు అవార్డులందుకున్న ఆయన 2015లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఈ ఏడాది తో 81వ వసంతం లోకి అడుగుపెట్టిన ఆయన తన ఆరోగ్య కారణాల వల్ల కొన్నాళ్ల నుండి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో మంచి పాత్ర వస్తే సినిమాల్లో నటించడానికి తాను
ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని అన్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు