Mega Family: నిహారికను పెళ్లి చేసుకుంటే బ్రతుకు బస్టాండే.. టాలీవుడ్ హీరో సంచలనం ?

సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో తన వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా వీరి పేరు విపరీతంగా మార్మోగిపోతుంది. సోషల్ మీడియా, టీవీ, ప్రింట్ మీడియా ఇలా ఎక్కడ చూసినా సరే వీరి విడాకుల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న ఈ జంట ఇటీవలే కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందారు.

అయితే వీరి విడాకులపై అనేక రూమర్స్ రావడంతో వాటిపై నిహారిక ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. “నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే వివాహ బంధానికి వీడ్కోలు పలికాం అని.. మమ్మల్ని అర్థం చేసుకొని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలండి” అని కూడా కోరుకుంది నిహారిక. అటు చైతన్య కూడా పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని తెలియజేశాడు.

అయినప్పటికీ వీరి విడాకులకు కారణం ఇదేనంటూ అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వీరిద్దరిలో తప్పు ఎవరిది..? ముందు ఎవరు విడాకులు తీసుకుందాం అనుకున్నారు అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. నిహారికని పెళ్లి చేసుకుంటే చైతన్యకు కష్టాలు తప్పవని ఓ మెగా హీరో ముందే హెచ్చరించాడట.

- Advertisement -

వీరిద్దరి నిశ్చితార్థానికంటే ముందే ఈ విషయాన్ని చైతన్యకు చెప్పాడట ఆ మెగా హీరో. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మరెవరో కాదు నిహారిక అన్న వరుణ్ తేజ్. “నా చెల్లి ఓ గయ్యాలి. తాను అనుకున్నది సాధిస్తుంది. చాలా మొండిది” అని నిశ్చితార్థానికి ముందే చైతన్యతో సరదాగా కామెంట్ చేశాడట వరుణ్ తేజ్. దీంతో ఆ రోజు వరుణ్ తేజ్ చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయి అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు