Niharika Konidela: పెళ్లికి ముందే మెగా డాటర్‌కు ఇన్ని లవ్ ఎఫైర్లు ఉన్నాయా..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో సినీ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మెగా డాటర్ నిహారిక. వాస్తవానికి మెగా డాటర్స్ ఎంతమంది ఉన్నా.. నిహారిక అల్లరి, నిహారిక అందం, నిహారిక చిలిపితనం.. వేరే వాళ్ళకి లేదని చెప్పాలి. అయితే 2020 డిసెంబర్ లో నాగబాబు ముద్దుల కూతురైన నిహారిక, ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో కరోనా సమయంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

వీరి ఈడు జోడు చూసి అందరూ ముచ్చటపడ్డారు. ఈ జంట సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తమ ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఈ ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాదు ఇన్ స్టాలో చైతన్య తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులకు సిద్ధమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లికి ముందే ఇద్దరు ముగ్గురితో ప్రేమలో పడిందన్న పుకార్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నిహారిక ముందుగా తన తొలి సినిమా హీరో నాగశౌర్యతో లవ్ ఎఫైర్ నడిపిందని, వారిద్దరూ కలిసి నటించిన సినిమాలో వారి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నిహారిక వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

- Advertisement -

అంతేకాదు ఆ తరువాత తన బావ సాయిధరమ్ తేజ్, నిహారిక మధ్య ఏదో ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ వార్తలను వారిద్దరూ ఖండించారు. ఇక చివరకు నిహారిక తన తండ్రి చూసిన అబ్బాయి చైతన్యను పెళ్లాడింది. అయితే ఇప్పుడు చైతన్య – నిహారిక జంట విడాకులకు సిద్ధమైందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. వీటిపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి నిహారిక – చైతన్య విడాకుల వార్తలు నిజమా? లేదా? అన్నది వారిలో ఎవరో ఒకరు స్పందిస్తేగాని క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు