పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా తర్వాత ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. రెండేళ్లకు ఒక్క సినిమా చేసే ప్రభాస్.. ఇప్పుడు స్పీడ్ పెంచేశాడు. వరుసగా సినిమాలకు అగ్రిమెంట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో.. ఆదిపురుష్, సాలార్, స్పీరిట్ తో పాటు మారుతి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా ఉంది. సినిమాలకు ఓకే చేయడమే కాకుండా.. స్పీడ్ గా షూటింగ్ లల్లో కూడా పాల్గొంటున్నాడు.
అయితే మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం డార్లింగ్ ఫోకస్ కంప్లీట్ గా సలార్ పైనే పెట్టాడట. మరో 10 రోజుల పాటు సలార్ లోని పెండింగ్ లో ఉన్న కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట. దీని కోసమే మారుతిని ప్రభాస్ వెయింటింగ్ లో పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
Read More: Nikhil: స్పై సినిమా రిలీజ్ నిఖిల్ కి ఇష్టం లేదా..?
డార్లింగ్ కోసం మారుతి.. కామెడీ, హార్రర్ నేపథ్యంలో సాగే స్టోరీని సిద్ధం చేశారట. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. మారుతి కామెడీ మార్క్ ను టచ్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు యాక్ట్ చేయనున్నారు. ప్రభాస్ కోసం అంతా రెడీ చేసిన మారతి వెయింటింగ్ కు ఇప్పుడైనా పుల్ స్టాప్ పడుతుందా.. లేక మరిన్నీ రోజులు వెయిట్ చేయకతప్పదా.. అనే ప్రశ్నకు మరి కొద్ది రోజుల్లో ఆన్సర్ రానుంది.
Read More: Ketika sharma: సినిమాల కంటే వాటిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందిగా?
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...