కొర‌టాల అంటే నాన్ లోక‌ల్ హీరోయేనా..?

కొర‌టాల శివ‌.. ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయ‌న సినిమాలు మిర్చి, శ్రీ మంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను క‌మర్ష‌య‌ల్ హిట్ అందుకున్నాయి. ఈ సినిమాలు వ‌రుస‌గా హిట్ కొట్ట‌డంతో కొర‌టాల శివకు.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చేసే అవ‌కాశం వ‌చ్చిందని చెప్ప‌వ‌చ్చు. టాలీవుడ్ కు నాలుగు హిట్ సినిమాలు అందించినా కొర‌టాల శివకు.. ఒక నెగిటివ్ టాక్ న‌డుస్తుంది. సినిమా ఏది అయినా.. కాన్సెప్ట్ మాత్రం ఒక్క‌టే. హీరో బ‌య‌ట నుంచి రావ‌డం.. ప్ర‌జ‌ల కోసం ఫైట్ చేయ‌డం అనేది ప్ర‌తి సినిమా స్క్రీప్ట్ లో భాగం అయిపోయింది.

కొర‌టాల డైరెక్ట‌ర్ గా ప‌రిచయం అయిన మిర్చి సినిమాలో హీరో ప్ర‌భాస్.. విల‌న్ ఇంటికి వ‌చ్చి రౌడీయిజాన్ని మార్చాల‌ని చూస్తాడు. అలాగే శ్రీ‌మంతుడు సినిమాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. హైద‌రాబాద్ నుంచి త‌న సొంత గ్రామానికి వెళ్లి ద‌త్త‌త తీసుకుంటాడు. సినిమా మొత్తం అక్క‌డే సాగుతుంది. జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో తార‌క్.. ముంబై నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చి సెటిల్ అవుతాడు. భ‌ర‌త్ అనే నేను సినిమాలో సూప‌ర్ స్టార్.. తండ్రి చ‌నిపోతే మ‌హేష్ హైద‌రాబాద్ వ‌చ్చి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తాడు. ఇలా అన్ని సినిమాల్లో హీరో స్థానికంగా ఉండ‌డు. ప్ర‌జ‌ల కోసం ఎవ‌రో ఒక్క‌రు రావాలి. అత‌నే జ‌నం జీవితాల‌ను మార్చుతాడు. అనే ఫార్మెట్ లోనే సినిమాలు చేస్తున్నాడు.

అలాగే ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతున్న ఆచార్య సినిమాలో కూడా.. ఇలాంటి కాన్సెప్ట్ తోనే వ‌స్తుంద‌ని సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ త‌ర్వాత ఆచార్య పాత్ర‌లో చిరంజీవి ధ‌ర్మ‌స్థ‌లిని ఆధ‌ర్మ‌స్థ‌లి కాకుండా కాపాడుతాడు. ఇలా ఆచార్య సినిమాలో చిరంజీవి పాత్ర కూడా నాన్ లోక‌లే అన‌ట్టు ట్రైల‌ర్ తో క‌న్ఫామ్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజ‌న్లు .. కొర‌టాల శివ స్క్రీప్ట్ పాత ప‌ద్ద‌తిలోనే ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. క‌థ ఫార్మెట్ మార్చాల‌ని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు