టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఎడిటింగ్ స్టాయి నుంచి వచ్చిన రాజమౌళి.. భారత చలన చిత్ర పరిశ్రమపైనే తనదైన బ్రాండ్ వేశాడు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి సినిమా ఒక సంచలనమే. ఈ విజయాలతో డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల టేస్ట్ పై ఎంత గ్రిప్ ఉందో తెలుస్తుంది. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ప్రపంచాన్నే తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా నేటి వరకు రూ. 1,050 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రాజమౌళి తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే పలు వేదికలపై తన తర్వాతి సినిమా ప్రిన్స్ మహేష్ బాబుతో ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. కాగ మహేష్ సినిమా కోసం రాజమౌళి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. దర్శకధీరుడు.. గత సినిమాలకు మించి స్టోరీ ఉండేలా చూస్తున్నాడట. గతంలో రాజమౌళి టచ్ చేయని స్పై థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఆఫ్రికన్ అడవుల్లో ఈ చిత్రాన్ని చిత్రికరించాలని రాజమౌళి ప్లానింగ్‌లో ఉన్నారట.
అయితే ప్రస్తుతం ఏజెంట్ తో అక్కినేని అఖిల్ తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా స్పై థ్రిల్లర్ జోనర్ లోనే సినిమాలు చేస్తున్నారు. దీంతో రాజమౌళి కాస్త డిఫరెంట్ గా.. ఈ స్పై థ్రిల్లర్ జోనర్ కథలో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెలింగ్ ఎలిమెంట్స్ ను జోడించాలని చూస్తున్నారట. అయితే రాజమౌళి కొత్తగా టచ్ చేస్తున్న స్పై థ్రిల్లర్ విత్ సైన్స్ ఫిక్షన్ జోనర్ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.