తెలుగు ఇండస్ట్రీని లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ దీనికి బాధితులుగానే మిగులుతున్నారు. ఇక మెగా కంపౌండ్ హీరోలకు అయితే.. లీక్స్ కొత్తేమీ కాదు. నిజానికి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నుండే ఈ లీక్స్ బాధలు ఎక్కువ అయ్యాయి. దీని తర్వాత చాలా సినిమాలు ఈ సమస్య భారీన పడ్డాయి.
రామ్ చరణ్ – శంకర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఒక్క ఫోటో మాత్రమే వచ్చింది. అంత జాగ్రత్తగా ఉన్న మూవీ యూనిట్ కూ లీక్ రాయుళ్లు పెద్ద షాక్ ఇచ్చేశారు. ఈ మూవీ నుంచి రెండు ఫోటోలను బయటకు వదిలారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క ఫోటోలు రామ్ చరణ్.. సైకిల్ పై ఉన్నాడు. కాస్త పెద్దవాడిల కనిపిస్తున్నాడు. అలాగే మరొక్క ఫోటోలో యంగ్ లుక్ లో ఉండి.. ట్రాఫిక్ పోలీస్ లతో గొడవ పడుతున్నాడు.
ఈ పిక్స్ బయటకు రావడంతో స్టోరీ ఇదే అంటూ ఓ గాసిప్ కూడా చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ తన కెరీర్ లో తొలి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. తండ్రిగా, తనయుడిగా.. రామ్ చరణ్ కనిపించబోతున్నారట. అలాగే ఈ మూవీ మొత్తం విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతుందని టాక్. అయితే ఇది నిజమా.. అని తెలియాలంటే.. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.