పూరి సినిమాలో పూజ.?

పూరి జగన్నాధ్
గన్ నుండి బుల్లెట్స్ దూసుకొచ్చినట్లు
ఈయన పెన్ నుండి డైలాగ్స్ దూసుకొస్తాయి.
అతి తక్కువ టైములో కథలను రెడీ చేసి అంతే జెట్ స్పీడ్ లో సినిమాను పూర్తి చేయడం పూరి స్టైల్, “ఇస్మార్ట్ శంకర్” లాంటి హిట్ తర్వాత, విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యపాండే నటించింది,
ప్రపంచ లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ ఓ కీలక పాత్ర లో కనిపించనున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత పూరి విజయ దేవరకొండతోనే సినిమాని చేయనున్నారు.

‘జనగణమన’ పూరి డ్రీం ప్రాజెక్ట్, ఇప్పటివరకు పూరి దగ్గర ఉన్న అన్ని స్క్రిప్ట్ లలో కంటే జనగణమన బెస్ట్ అని పూరి ఎప్పుడు చెప్తూ వచ్చాడు.
అప్పట్లో మహేష్ తో ఆ సినిమాను చేయబోతున్నట్లు అనౌన్స్ కూడా చేసాడు పూరి, కానీ ఇప్పుడు విజయ్ తో ముందు వెళ్తున్నాడు పూరి జగన్నాధ్ , ఈ సినిమాలో విజయ్ కి హీరోయిన్ గా పూజ హేగ్దే ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు