త్రివిక్రమ్ ను వదిలేశావా..?

తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలియని వారు ఉండరు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే.. వెంటనే గుర్తు వచ్చే మరో పేరు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరి ఇద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవరం లేదు. వీరి మధ్య ఉన్న బంధం గురించి గురుజీ కూడా పలు వేదికలపై ప్రకటనలు కూడా చేశాడు.

పవన్ పై ఉన్న సన్నిహిత్యంతో త్రివిక్రమ్.. ఆయన సినిమాలకు ఏదో ఒక రకంగా వర్క్ చేస్తునే ఉంటాడు. ఇటీవల సాగర్ కే చంద్ర దర్వకత్వంలో విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమాను నడిపించిన గురుజీ కే.. వినోదయ సీతం తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ను గబ్బర్ సింగ్ వదిలేశాడట. వినోద సీతం రీమేక్ కు డైలాగ్స్ ను త్రివిక్రమ్ తో కాకుండా.. మరో రచయితతో పవన్ రాస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. హరి హర వీర మల్లుకు డైలాగ్స్ రాసిన బుర్రా సాయిమాధవ్‌.. ఈ రీమేక్ మూవీ కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం.

త్రివిక్రమ్-మహేష్ సినిమా నేపథ్యంలోనే గురుజీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు