భీముడు వచ్చేశాడురో..!

నందమూరీ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న రోజు రానే.. వచ్చింది. తారక్ నట విశ్వరూపం చూపించిన కొమురం భీముడో సాంగ్ ఎట్టకేలకు యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సౌండ్ ట్రాక్ హక్కులను దక్కించుకున్న లహరి మ్యూజిక్ తాజా గా కొమురం భీముడో ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

దర్శకధీరుడు జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ అద్భతంలో కొమురం భీముడో సాంగ్ కు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినవరం లేదు. మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ తో పాటు ఈ పాట సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. ఈ ఒక్క పాటతో చాలా మంది తారక్ ఫ్యాన్స్ అయిపోయారు. అలాంటి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఇంకెందుకు వెయింటింగ్.. మరోసారి చూసి ఎంజాయ్ చేసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు