1 కెజిఫ్ విత్ 10 కెజిఫ్ లు

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు సన. ఈయన సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పుడున్న తెలుగు దర్శకులలో సుకుమార్ పంథా వేరు. తన దగ్గర వర్క్ చేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ను, డైరెక్టర్ చేసే ఉద్దేశ్యం ఆయనది.

కుమారి 21 ఎఫ్ సినిమాతో సూర్య ప్రతాప్ పల్నాటి ను దర్శకుడిగా పరిచయం చేసారు, ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు ను, అలానే తన దగ్గర వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ కి ఒక్కో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు సుకుమార్. సుకుమార్ చివరగా చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.
ఈ సినిమా కి రిలీజ్ ముందు మంచి అంచనాలు ఉండేవి. తరువాత ఒక పబ్లిక్ ప్లాట్ఫ్రామ్ లో తన పుష్ప సినిమా 10 కెజిఫ్ లతో సమానం అని చెప్పాడు. దానితో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి కొందరిలో,
సినిమా మంచి సక్సస్ అయినా బుచ్చిబాబును కొందరు ట్రోల్ చెయ్యడం మానలేదు.

రీసెంట్ గా బుచ్చిబాబు పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటో ను షేర్ చేస్తూ డైరెక్టర్ మై రీసెంట్ ఇన్స్పిరేషన్ ప్రశాంత్ నీల్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మిమ్మల్ని కలవడం సంతోషం ఉంది అని, సంతోషకరమైన సంభాషణ జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ 1 కెజిఫ్ విత్ 10 కెజిఫ్ లు అంటూ సెటైరికల్ గా పోస్ట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు