మ.. మ.. మాస్ మహేషా..

టాలీవుడ్ సినిమాలు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మ్యూజిక్ హైలైట్ టచ్ గా ఉంటుంది. దానిలో కమన్ గా.. ఎస్ ఎస్ థమన్ పేరు వినిపిస్తుంది. వకీల్ సాబ్, అఖండ, డీజే టిల్లు తో పాటు రాధేశ్యామ్ సినిమాల్లో థమన్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమాలు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అందుకోవడంతో థమన్ కు వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి.

ప్రస్తుతం థమన్.. సర్కారు వారి పాటతో పాటు మెగా స్టార్ గాడ్ ఫాదర్, దళపతి 66, రామ్ చరణ్ 15వ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలతో మ్యూజిక్ ఫెస్టివల్ ఉండటం ఖాయం. ఇప్పటికే సర్కారు వారి పాట నుంచి వచ్చిన కళావతి, పెన్నీ సాంగ్స్ మ్యూజిక్ దుమ్ములేపాయి. ట్రైలర్ లో కూడా బీజీఎం.. ప్రిన్స్ ఫ్యాన్స్ కు పిచ్చేక్కించింది.

తాజా గా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన మా.. మా.. మహేషా.. అంటూ సాగే మాస్ పాటను రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అలాగే థమన్.. ‘ మాస్ సాంగ్ ను చూడటం జరిగింది.. గెంతులు కూడా వేయడం జరిగింది ‘ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ మా.. మా.. మహేషా సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రిన్స్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు