ట్రిపుల్ ఎంటర్ టైన్ మెంట్..!

శ్రీ విష్ణు.. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా ఆయన నటించిన భళా తందనాన ఈ రోజు థియేటర్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలు చేసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ సినీ లవర్స్ ను కొంత వరకు ఎంటర్ టైన్ చేస్తుంది.

అయితే ఈ సినిమా తర్వాత.. శ్రీ విష్ణు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అల్లురి అనే సినిమాను ప్రకటించాడు. అతి త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేస్తానని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత.. శ్రీ విష్ణు మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు.

ఈ మూవీలో ఈ యంగ్ హీరో కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ప్రయోగాన్ని చేయనున్నారట. ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడట. శ్రీ విష్ణుతో ఇప్పటికే రాజ రాజ చోర సినిమా తెరకెక్కించిన హసిత్ గోలీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడట.

- Advertisement -

రాజ రాజ చోరలో డైరెక్టర్ రెండు షెడ్స్ లో శ్రీ విష్ణును చూపించాడు. ఇప్పుడు మూడు విభిన్న పాత్రల్లో చూపించడానికి స్టోరీని సిద్ధం చేస్తున్నాడు. కాగ ఈ ప్రయోగంతో శ్రీ విష్ణు హిట్ అవుతాడా.. లేదా.. ఎప్పటిలాగే.. నిరాశపరుస్తాడా.. అంటే.. ఈ మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు