విరాటపర్వం ఇంకెప్పుడు.?

దగ్గుపాటి రానా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్,
పదిమందిలో ఒకడిలా కాకుండా పదిమందికి ఒక్కేడే అనేలా ఉంటాయి రానా స్టోరీ సెలెక్షన్స్.

ఒకే పంథాలో సినిమాలు చేస్తున్న హీరోలకు,
బాక్గ్రౌండ్ ఉన్న సక్సెస్ లేని హీరోలందరికీ రానా నే ఆదర్శం,
రానా ప్రయాణమే నిదర్శనం. ప్రస్తుతం రానా , సాయి పల్లవి హీరోహీన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. “నీది నాది ఒకే కథ” దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా సాంగ్స్ కి టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి మనకు తెల్సిందే. వాయిదా పడిన సినిమాలన్నీ ఈ మధ్య కాలంలో వరుసగా రిలీజ్ అయిపోయాయి.
అలానే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు