వర్మకి ఏంటి కర్మ

అప్పటివరకు ఒక మూసలో సాగే తెలుగు సినిమాని
రామ్ గోపాల్ వర్మ అనే ఒకడు వచ్చి పరుగులు పెట్టించాడు.
తెలుగు సినిమా దిశ,దశ రెండింటిని మార్చేశాడు.
ఫైట్స్, డైలాగ్స్,మ్యూజిక్ అన్ని కలిసి ఆ సినిమాకు ఒక డిఫరెంట్ ఫీల్ ను తీసుకొచ్చాయి,అందుకే శివ సినిమా అప్పటికి,ఇప్పటికి ఒక సంచలనమే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి అంటే శివ సినిమాకి ముందు, శివ సినిమా తరువాత అంటారు.

అప్పట్లో ఆయన తీసిన ప్రతి సినిమా ఒక సంచలనం. గాయం , రంగీలా , క్షణక్షణం, గోవిందా గోవిందా, సత్య ఇవన్నీ మాములు సినిమాలు కాదు, ఎంతోమంది ఆలోచనలను కదిపేసి , కుదిపేసిన సినిమాలు. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ కి ఆయన ఒక ఇన్స్పిరేషన్.
క్రియేటివిటీ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే ఈయన కొంతకాలం తరువాత
కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.

ఇప్పుడు వర్మ సినిమా అంటే ఏమాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి లేకపోవడం వలన ఆయన కొత్త సినిమా ‘మా ఇష్టం’ సినిమాకి థియేటర్లు దొరకలేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. కానీ వర్మ మాత్రం గ్రాండ్ రిలీజ్ అంటూ ట్విట్టర్లో పోస్టర్లు వదిలాడు. అబిడ్స్‌లోని సప్న సినిమాస్‌లో మార్నింగ్, మ్యాట్నీ షోల వరకు ఈ సినిమా పరిమితం కాబోతోంది. ఇంకో ఆరు రోజుల్లో మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ కాబోతుంది. ఆ తరువాత ఈ సినిమా ఉండదు.వర్మ సినిమాకి హైదరాబాద్ లోనే ఇలానే మిగతా రాష్ట్రాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్న వర్మ సినిమాకి ఈ కర్మ ఏంటో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు