మహేష్ ముందు కొత్త సవాల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. లేటెస్ట్ గా నటించిన సర్కారు వారి పాట మరో ఆరు రోజుల్లో రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నాడు. బ్యాకింగ్ రంగంలో జరిగిన ఓ స్కామ్ నేపథ్యంలో ఈ స్టోరీని దర్శకుడు రూపొందించాడు. మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సూపర్ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ప్రిన్స్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 

అయితే మహేష్ బాబుకు ఈ సినిమా తర్వాత కొత్త సవాళ్లు రెడీగా ఉన్నాయి. మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు దర్శకధీరుడు జక్కన్నతో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా వచ్చాయి. 

కానీ మహేష్ .. ఈ ఇద్దరిలో ముందు ఎవరితో మూవీ చేయాలనే డైలామోలో ఉన్నాడు. రాజమౌళితో సినిమా అంటే.. కనీసం  2 నుండి 3 ఏళ్ల పాటు త్యాగం చేయాల్సిందే. దీనికి ముందు త్రివిక్రమ్ తో అంటే.. ఆయన ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియాలోనే ఉన్నాడు. త్రివిక్రమ్ తో సినిమా నిజానికి ఏప్రిల్ లోనే స్టార్ట్ కావాల్సింది. పవన్ సినిమాల వల్లే అలస్యం అవుతూ.. వస్తుంది.

త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ చేయడు.. జక్కన్న స్టార్ట్ చేస్తే రెండేళ్ల వరకు ఆగదు. దీంతో మహేష్ తక్షణ కర్తవ్యం ఏంటి అంటూ డైలామోలో ఉన్నాడట. మహేష్ నెక్ట్స్ సినిమా తెలియాలంటే.. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు