ఒక సినిమా హిట్ కావాలంటే.. ప్రమోషన్స్ గట్టిగా జరిగాలి. లేదా.. ఆ హీరోకు బీభత్సమైన క్రేజ్ అయినా ఉండాలి. ఈ మధ్య కాలం ఎంత పెద్ద హీరో అయినా.. కోట్ల కొమ్మరించి ప్రమోషన్స్ జరుపుతున్నారు. కానీ ప్రస్తుతం ఓ యంగ్ హీరో సినిమాకు ప్రమోషన్స్ పెద్దగా చేయకున్నా.. పేరు మాత్రం గట్టిగానే వచ్చింది. అంతే కాకుండా.. ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకు సపోర్ట్ కూడా వస్తుంది. దీనికి కారణం ఓ వివాదామే అని చెప్పవచ్చు.
ఆ హీరోనే మాస్ క దాస్ విశ్వక్ సేన్.. ఆయన లేటెస్ట్ మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కు ముందే.. కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. అది ఓ టీవీ ఛానల్ తో జరిగిన వివాదం వల్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవరం లేదు. ఫ్రాంక్ వీడియోతో స్టార్ట్ అయిన ఈ నాటకం.. చిలికి చిలికి పెద్ద గాలి వానగా మారింది.
దీని వల్ల ఆయన సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ సమయంలో కూడా.. చిన్న గొడవను పెద్దదిగా చిత్రీకరించారు. ప్రమోషన్స్ కు వాడుకున్నారు. మళ్లీ ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో.. సినిమా ప్రమోషన్స్ కోసమే.. గొడవలు క్రియేట్ చేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి.
ఏదీ ఏమైనా.. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఈ ఫార్ములతో సక్సస్ అయ్యారు. దీంతో వ్యూచర్ లో కూడా ఇలాంటివి కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.