కీర్తి సురేష్,
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకుంది.మహానటి సావిత్రమ్మ పాత్రలో ఒదిగిపోయింది.
ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుంది కీర్తిసురేష్.
తెలుగులో స్టార్ హీరోల పక్కన అవకాశం రావడం కష్టమే అని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
నేను శైలాజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కీర్తి తన నటనతో తెలుగు ప్రేక్షకులలో మంచి అభిమానాన్ని సంపాదించుకుంది,
ఆ తరువాత చేసిన “నేను లోకల్” సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోయినా ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఆ సినిమా కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోయినా మహానటి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన గొప్ప సినిమా చేసి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది.
Read More: Priya Anand : రానా హీరోయిన్ రీ ఎంట్రీ !
ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయని కీర్తి ,పెంగ్విన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది,అది అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు.
ఆ తరువాత వచ్చిన మిస్ ఇండియా పరిస్థితి కూడా అంతే.
అంత ఫేమ్ ఉన్న కీర్తి సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రైమ్ లో విడుదల అయినా కీర్తి సురేష్ చిన్ని(సాని కడియం) గురించి ఎక్కడా చప్పుడే లేదు. మాములుగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సినిమాలకి మంచి పబ్లిసిటీ ఇచ్చే అమెజాన్ ప్రైమ్, కనీసం ఈ సినిమా రిలీజ్ అవుతోందన్న అనే విషయాన్ని గట్టిగా ప్రోమోట్ చెయ్యలేకపోయింది.
Read More: ప్రైమ్ వీడియో : థియేటర్స్‌కు ధీటుగా.. పోటీగా
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో బ్రహ్మానందం,...
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు…...
రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన...
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే వంటి...
అలా మొదలైంది సినిమాతో తెలుగులో హీరోయిన్...