విశ్వక్ సినిమాకే సపోర్ట్ ఎందుకు.?

సుమ కనకాల
బుల్లితెరపై ఎన్నో షోస్ తో అలరిస్తూ, ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు యాంకరింగ్ చేస్తూ, ఎంతోమంది యాంకర్స్ కి రోల్ మోడల్ అయ్యింది.
కళ్యాణ ప్రాప్తిరస్తూ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించిన ఆమె చాలాకాలం వెండితెరపై పూర్తి స్థాయిలో కనిపించడం మానేశారు. డీ , వర్షం , బాద్షా లాంటి సినిమాలలో కనిపించినా, ఆమె పూర్తి దృష్టి మాత్రం టీవీ షోస్ & యాంకరింగ్ మీద మాత్రమే పెట్టారు.

చాలా ఏళ్ల తరువాత పూర్తిస్థాయిలో “జయమ్మ పంచాయితీ” అనే సినిమాలో కనిపించనున్నారు సుమ. ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీకాకుళం జిల్లా లోని పాలకొండ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో షూటింగ్ చేశారు. సుమ కి ఉన్న సర్కిల్ ద్వారా ఈ సినిమాని రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ & మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ప్రోమోటో చేస్తూ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ను రిలీజ్ చేసారు.

ఈ సినిమా కి మంచి బజ్ తీసుకురావాలని సుమక్క విశ్వ ప్రయత్నాలు చేసినా, ఇండస్ట్రీ మొత్తం విశ్వక్ సేన్ సినిమాను ప్రామోట్ చేస్తున్నారు.
దీనికి బలమైన కారణం రీసెంట్ గా ఒక ఛానల్ తో విశ్వక్ కి జరిగిన గొడవ, ఆ యాంకర్ ప్రవర్తించిన తీరు అవ్వొచ్చు. ఆ సదరు ఛానల్ తో చాలామందికి సినీ ప్రముఖులకు కొద్దిపాటి విబేధాలు ఉన్నాయ్ బహుశా విశ్వక్ సేన్ సినిమాని ప్రోమోట్ చేయడానికి ఇదే కారణం కావొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు