హ్యట్రిక్ హిట్స్ తర్వాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. గీత గోవిందం ఫేం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి సర్కారు వారు రెడీ అవుతున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రీ – రిలీజ్ ఈవెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు ఇండస్ట్రి వర్గాల టాక్.
అయితే సర్కారు వారి పాట నుంచి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ నిడివి 163 నిమిషాలు ఉంటుందట. అంటే దాదాపు 2:43 గంటలు. అయితే ఈ పెద్ద సినిమాలో ఏ చిన్న తప్పు దొర్లినా.. అట్టర్ ప్లాప్ ఖాయం. కానీ.. ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు దాన్ని మార్చేశాయి.
ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే.. నిడివితో సంబంధం లేకుండా.. సినిమాలు హిట్ అవుతాయని నిరూపించాయి. ఇప్పుడు మహేష్ సినిమా కూడా మరోసారి దీన్ని ప్రూవ్ చేస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట సినిమా.. బ్యాకింగ్ రంగంలో జరిగిన ఓ స్కామ్ నేపథ్యంలో సాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.