ఖిలాడీ ముందు క్రాక్ హిట్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ.. రో హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు… ప్రస్తుతం ఈ మాస్ హీరో.. రామరావు ఆన్ డ్యూటీ తో పాటు రాావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు చేస్తున్నాడు. అలాగే మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ మెయిన్ రోల్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. రామరావు ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో రవితేజ ఉన్నాడు. ఈ మూవీని వచ్చే నెల 17 వ తేదీన రిలీజ్ చేయలాని యూనిట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. కాగ ఈ సినిమా నుంచి ఇప్పటికే సిద్ శ్రీరామ్ పాడిన బుల్ బుల్ తరంగ్.. సాంగ్ రిలీజ్ చేశారు. తాజా గా సెకండ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ నెల 7వ తేదీన సొట్టల బుగ్గలో.. అనే సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు మాస్ మహారాజ ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. రొమాంటిక్ మెలోడీ సాంగ్ కోసం రవితేజ ఫ్యాన్స్ వెయిట చేస్తున్నారు.