Kannappa: కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో.. ప్రభాస్ లేనట్లేనా..?

Kannappa: హీరో మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భక్త కన్నప్ప ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎప్పటినుండో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని భక్త కన్నప్ప ప్రాజెక్ట్ గురించి చెబుతున్నాడు. ఈ సినిమాని అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేశాడు. కన్నప్ప అనే టైటిల్ తో తెరక్కెక్కబోతున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నాడు. విష్ణుకి జోడిగా బాలీవుడ్ భామ నుపూర్ సనన్ నటిస్తోందని ప్రకటించినా.. ఇటీవల ఆ సినిమా నుంచి నుపూర్ తప్పుకున్నట్లు విష్ణు స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చాలామంది స్టార్ నటులు కూడా నటించనున్నారు. మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల వంటి స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. విదేశాలలో కన్నప్ప సినిమాను మొదలుపెట్టి.. అక్కడ కొన్ని సన్నివేశాలను తెరకెక్కించి ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రంలో శివుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించబోతున్నారని ఓ ట్వీట్ ద్వారా మంచు విష్ణు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ చిత్రంలోని శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం లేదని.. శివుడి పాత్రలో బాలీవుడ్ ఆగ్ర హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని కలలు కన్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ప్రభాస్ ఈ చిత్రంలో శివుడి వాహనం నంది పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు