Allu Arha: పాన్ ఇండియా మూవీలో అల్లు అర్హ.. జాతీయ గుర్తింపు గ్యారంటీ..!

Allu Arha.. పూర్వం నుంచి ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. వారు చైల్డ్ ఆర్టిస్టులుగా సత్తా చాటుతూ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా కొనసాగుతూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.. ఇక అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. ఇప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత.. వీరు కూడా తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక వారిలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉంటారు. ఒకప్పుడు స్వర్గీయ హాస్యబ్రహ్మ అల్లు రామలింగయ్య మనవడిగా చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. నేడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్నారు.. ఇక ఈయన కూడా తన కూతురు అల్లు అర్హని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే..

Allu Arha: Allu Arha got a chance to pan India movie
Allu Arha: Allu Arha got a chance to pan India movie

పాన్ ఇండియా మూవీలో అల్లు అర్హ..

అల్లు అర్హ ఎంత క్యూట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన ముద్దు ముద్దు మాటలతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.. పైగా ఈ పాపకు సంబంధించిన ప్రతి వీడియోని..తల్లి అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడియన్స్ కి బాగా దగ్గరైన అల్లు అర్హ.. సమంత , గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించి అదరగొట్టేసింది.. ఇక ఈ సినిమా ద్వారా భారీ గుర్తింపు సొంతం చేసుకుంది అల్లు అర్హ.. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అల్లు అర్హ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిన్నారి మరో పాన్ ఇండియా చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

దేవరా సినిమాలో అల్లు అర్హ..

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర .. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతోంది. ఇక మొదటి పార్ట్ లో అందాల ముద్దుగుమ్మ స్వర్గీయ అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపికయింది. ఇక జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో అల్లు అర్హ నటించబోతోందని సమాచారం. ఇఇదే నిజమైతే అల్లు అర్హ రేంజ్ నిజంగా జాతీయస్థాయిలో పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది.. ఇప్పుడు ఈ సినిమాలో అల్లుఅర్జున్ కూతురు నటిస్తోంది.. ఒకవేళ ఈ సినిమా గనుక భారీ విజయాన్ని అందుకుంటే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిన్నారికి గుర్తింపు లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందే సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్హ ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది.. అల్లు అర్హ నటిగా మాత్రమే కాదు చెస్ ప్లేయర్ కూడా.. మల్టీ టాలెంటెడ్ ఉన్న ఈ చిన్నారి భవిష్యత్తులో తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు