War 2: ఎన్టీఆర్ సరసన యానిమల్ బ్యూటీ..?

War 2 : హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న “వార్ 2” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ గా ఓవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు “వార్ 2” సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. స్పై యూనివర్స్ కాబట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే అర్థమయిపోయింది. యష్ రాజ్ స్పై ఫిలిమ్స్ లో ఎన్టీఆర్ భాగమవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.

ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్. ఈ మూవీ పదిరోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే ముంబైలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీలోని ఓ భారీ ఆక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో రూమర్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన యానిమల్ బ్యూటీ “తృప్తి డిమ్రి” నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ బ్యూటీ యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అంత క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వార్ 2 లో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇప్పుడు వార్ 2 లాంటి క్రేజీ ప్రాజెక్టుని ఓకే చేయడంతో ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫ్యాన్స్ కూడా దేవర సినిమాకంటే ఎక్కువ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు