Pan India Movies : జూన్ నుంచి అక్టోబర్ వరకు నెలకో పాన్ ఇండియా మూవీ… అసలైన సినిమా పండగ

Pan India Movies : సమ్మర్ లో చక్కగా ఏసీలో కూర్చుని ఫ్యాన్ ఇండియా స్టార్స్ సినిమాలతో థియేటర్లలో ఫుల్ గా ఎంటర్టైన్ అవుదాం అంటే ఈసారి పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి అని బాధపడుతున్నారా? అయితే ఏం పర్లేదు ఈ ఏడాది ద్వితీయార్థం మొత్తం సినిమా పండగే జరగబోతోంది. నెలకో పాన్ ఇండియా మూవీతో సినీ ప్రియుల కోసం సినిమా జాతర జరగబోతోంది. జూన్ నుంచి మొదలు కాబోతున్న ఈ బిగ్గెస్ట్ ఫిలిం ఫెస్టివల్ అక్టోబర్ దాకా కంటిన్యూ కాబోతోంది. మరి వరసగా రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఏంటి? ఏ మూవీ ఏ నెలలో రాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

1. జూన్ తో మొదలు…

ఈ ప్యాన్ ఇండియా సినిమా జాతరను సౌత్ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ ఫస్ట్ మొదలు పెట్టబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో ఆయన ఇండియన్ 2 అనే సీక్వెల్ తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ కలిసి నటిస్తున్న ఇండియన్ టు మూవీ జూన్ లో థియేటర్లలోకి రాబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంచారు.

2. జూలైలో కల్కి దండయాత్ర

మోస్ట్ అవిటింగ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ గురించి ఆయన అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ అంతా కళ్ళలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నిజానికి మే 9న అంటే ఈపాటికి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేయాల్సింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కారణంగా కల్కి జూలైలో రాబోతుందని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

3. పుష్పరాజ్ దే ఆగస్టు…

ఇక మరో భారీ అంచనాలున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ మూవీ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అల్లు ఫ్యాన్స్. ఈ మూవీ ఆరు నూరైనా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుందని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ ఆగస్టు రచ్చ మొత్తం పుష్ప రాజ్ దే.

4. సెప్టెంబర్ లో ఓజి రాక

బ్రో తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మూవీ రాక చాలా కాలమే అవుతుంది. దీంతో పవన్ అభిమానులు ఫుల్ గా ఆకలి మీద ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికే ఓజి సెప్టెంబర్ లో థియేటర్లలోకి దిగబోతోంది. ఈ గ్యాంగ్ స్టర్ మూవీనీ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తుండగా, సెప్టెంబర్ 27న థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఓజి.

5. అక్టోబర్ లో దేవర, గేమ్ ఛేంజర్

ఇక అక్టోబర్ నెలలో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దేవర మూవీ అక్టోబర్ 10న థియేటర్లలోకి రాబోతోంది. అయితే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు మేకర్స్. మొత్తానికి ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో అసలు సిసలైన సినిమా పండగ ఉండబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు