War 2 Movie UpDate : వార్ 2 లో బాలీవుడ్ ఐటెం బాంబ్… హాట్ నెస్ తగ్గకుండా ప్లాన్

War 2 Movie UpDate : బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం “వార్”. 2019లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా “వార్ 2” తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీలో ఎన్టీఆర్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్. ఈ మూవీ పది రోజుల షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ముంబైలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీకి సంబంధించిన ఓ భారీ యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ లతో ఓ సూపర్ డాన్స్ నెంబర్ నీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సాంగ్ కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ ప్రత్యేక పాటను కూడా ప్లాన్ చేయమన్నారట. బాలీవుడ్ హీరోలలో ది బెస్ట్ డాన్సర్ హృతిక్ రోషన్ అన్న సంగతి మనకి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఎంతగొప్ప డాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దీంతో వీరి కాంబోలో సరైన సాంగ్ పడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అయితే ఈ సాంగ్ కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో హృతిక్ – ఎన్టీఆర్ లతో కలిసి బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా చెందులేయనున్నట్లు ఓ టాక్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. అంతేకాదు సోమవారం ఉదయం ఎన్టీఆర్ తో కలిసి ఊర్వశి రౌటేలా జిమ్ లో ఓ సెల్ఫీ ని పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు