Kanguva: “కంగువా” స్టోరీ లైన్ లీక్

తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “కంగువా” టీజర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ను చూసాక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది అయితే స్టోరీ ఏంటో కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా “కంగువా” స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ మూవీని రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన ఒక తెలుగు మూవీతో ముడి పెడుతూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఇంతకీ “కంగువా” స్టోరీ లైన్ ఏంటి? దానికి తెలుగు సినిమాకు లింక్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

కంగువా స్టోరీ లైన్ ఇదేనా?

సూర్య హీరోగా పిరియాడికల్ స్టోరీతో రూపొందుతున్న కంగువా మూవీని భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, బాబి డియోల్, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో విజువల్స్ అదిరిపోయాయని, సూర్య కొత్త మేకోవర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని, అలాగే మరో పాపులర్ స్టార్ బాబి డియోల్ క్రూరమైన లుక్ నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీ ఏంటి అనే చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. టీజర్ ను బట్టి చూస్తే ఇది ఒక అటవీ జాతి పోరాట యోధుడి కథ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దానికి మరి కొంచెం మసాలా యాడ్ చేసేలా మరో వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. 1678లో జీవించిన ఓ అటవీ జాతి నాయకుడు 2024లోకి వచ్చి ఒక రీసెర్చ్ స్టూడెంట్ సహాయంతో పూర్తికాకుండానే ఆగిపోయిన తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడనేదే “కంగువా” స్టోరీ లైన్ అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలీదు. గానీ ఈ స్టోరీ లైన్ వింటుంటే ఒక తెలుగు మూవీ కచ్చితంగా గుర్తు రావాల్సిందే.

- Advertisement -

ఈ తెలుగు మూవీకి రీమేకా?

“కంగువా” స్టోరీ లైన్ వినగానే తెలుగు ఆడియన్స్ కి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన “బింబిసార” మూవీ గుర్తొస్తుంది. ఈ మూవీలో కూడా అప్పట్లో రాక్షస ప్రవర్తన కలిగిన రాజు అనుకోకుండా మనుషుల ప్రపంచానికి వచ్చి, తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ తన లోకానికి వెళ్లి అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతాడు. మరి ఇంతకీ కంగువా స్టోరీ లైన్ కచ్చితంగా ఇదేనా? అంటే చెప్పలేం. కానీ ఆ స్టోరీ లైన్ మాత్రం బింబిసారా మూవీకి దగ్గరగానే అనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి హీరోగా రూపొందుతున్న “విశ్వంభర” మూవీ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందని టాక్ నడుస్తోంది. “కంగువా” టీజర్ రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ టాక్ వినిపించింది. కానీ నెమ్మదిగా అది మిక్స్డ్ టాక్ గా మారిపోతోంది. మరి కంగువా మూవీ స్టోరీ అందరూ ఊహించినట్టుగా బింబిసారాకు దగ్గరగా ఉంటుందా? లేదంటే అందరి అంచనాలను తలకిందులు చేసే డిఫరెంట్ స్టోరీతో రాబోతోందా అనేది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు