Katrina Kaif: తెలుగు సినిమా చేసేటప్పుడు ఆ బాధ భరించా..

ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. దక్షిణాది ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. అత్యంత సుకుమారంగా కనిపించే ఈ అందగత్తె తెలుగులో మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇటీవలే మేరీ క్రిస్మస్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.. ఇకపోతే కత్రినా కైఫ్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది..

విమర్శించే వారే ఎక్కువ..

నా కెరియర్ ప్రారంభంలో నా డాన్స్ గురించి తీవ్రంగా విమర్శించారు.. అసలు నేను నటిగా నిలదొక్కుకునే అవకాశం లేదు అని పలువురు ముఖం మీదే చెప్పారు. ఇక అవమానాలను ,ఆ విమర్శలను ఎప్పటికీ మర్చిపోలేను..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కూడా చేదు అనుభవం..

తెలుగు ఇండస్ట్రీలో కూడా చేదు అనుభవం ఎదురయ్యింది. ఇక్కడ ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ అమ్మాయికి డాన్స్ రాదని ఆ సినిమా నృత్య దర్శకుడు చెప్పడంతో చాలా బాధపడ్డాను.. అయితే ఆయన విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు.. చాలామంది నా ఎదురు గానే నువ్వు సక్సెస్ కావు అంటూ విమర్శించారు.. అయితే వాటన్నింటిని నేను సవాలుగా తీసుకొని ఇప్పుడు నేనేంటో నిరూపించాను అంటూ చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.. ఆనాడు వారు అన్న విమర్శలను పట్టించుకోని ఉంటే నేడు ఈ స్థాయికి చేరుకునే దాన్ని కాదని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ..

కత్రినా కైఫ్ కెరియర్..

కత్రినా కైఫ్ ఒక బ్రిటిష్ నటి.. ఈమె తండ్రి కశ్మీరీ కాగా తల్లి బ్రిటన్ కు చెందిన వారు. హిందీ తోపాటు తెలుగు, మలయాళం సినిమాలలో కూడా నటించిన ఈమె ఇటీవల కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ప్రఖ్యాత మోడల్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ ఇండియాలో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది..

కత్రినా కైఫ్ వ్యక్తిగత జీవితం..

ఆ అవమానాలు ఎక్కువే..ఇకపోతే గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపిన ఈమె అనుకోకుండా బ్రేకప్ చెప్పుకున్నారు.. ఆ తర్వాత చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ తో కూడా ప్రేమాయణం నడిపింది. రణబీర్ కపూర్ తో ఏకంగా పెళ్లి పీటల వరకు వెళ్లిన ఈమె ఏమైందో తెలియదు కానీ ఇద్దరు తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు.. ఇక తర్వాత విక్కీ కౌశల్ తో సహజీవనం చేసిన ఈమె ఎటువంటి హడావిడి లేకుండా వివాహం చేసుకుంది. రాజస్థాన్లోని ఒక ఖరీదైన హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెద్దగా సెలబ్రిటీలను పిలవకపోయినా అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కెరియర్ పైనే ఫోకస్ పెట్టిన కత్రినా కైఫ్ త్వరలోనే మరికొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు