Ajith : ఘుమఘుమలాడే బిర్యానీ వండిన అజిత్… వీడియో వైరల్

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు సౌత్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో వేగం తగ్గించిన అజిత్ తాజాగా తనలోని కొత్త ట్యాలెంట్ ను బయట పెట్టారు. ఆయన స్వయంగా ఘుమఘుమలాడే బిర్యానీని వండి వడ్డించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ అజిత్ ఈ బిర్యానీ స్టోరీ ఏంటి? అంటే…

బైక్ యాత్రలోనే బిర్యానీ ఘుమఘుమలు…

ఇన్నేళ్లు సినిమాలతో గజిబిజి జీవితాన్ని గడిపేసిన అజిత్ ఇప్పుడు బైక్ రైడింగ్ తో స్వేచ్ఛగా ప్రపంచాన్ని చుట్టే పనిలో పడ్డారు. బైక్ రైడింగ్ అంటే అజిత్ కు చాలా ఇష్టం. అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి బైక్ ట్రిప్పులకు వెళ్తున్నారు. బైక్ పై ప్రపంచాన్ని చుట్టి రావాలన్న తన చిరకాల కోరికను నెమ్మది నెమ్మదిగా నెరవేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే గత ఏడాది తన బైక్ పై వరల్డ్ టూర్ ను ప్రారంభించాడు అజిత్. మొదటి దశలో భాగంగా భారతదేశమంతా బైక్ పైనే విహారయాత్ర చేసి వచ్చాడు అజిత్. తదుపరి దశలో వివిధ దేశాలకు బైక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల, వాటిని పూర్తి చేసాక మళ్ళీ వరల్డ్ బైక్ టూర్ ని ఫుల్ స్వింగ్ లో కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు సినిమాలను పూర్తి చేశాక కొంతకాలం పాటు ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

ఇక తన తాజా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఆలస్యం కావడంతో అజిత్ ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో బైక్ ట్రిప్ వేస్తున్నాడు. ఆయనకు తోడుగా ఆరమ్ అనే మరో నటుడు కూడా ఉన్నారు. ఈ బైక్ ట్రిప్ లో అజిత్ తన స్నేహితులకు స్వయంగా తన చేతితో చేసిన బిర్యానిని వండి పెట్టారు. అజిత్ బిర్యాని వండిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియోను చూశాక చాలామంది లైఫ్ అంటే అజిత్ దే అంటున్నారు. తెలుగు వాళ్ళు మాత్రం అజిత్ ఎంతైనా ఇక్కడి వాడే కాబట్టి హైదరాబాద్ లో పాపులర్ అయిన బిర్యానీనీ అంత ఈజీగా వండగలుగుతున్నాడు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

అజిత్ సినిమాల విషయానికొస్తే…

కాగా ప్రస్తుతం అజిత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి విడా ముయార్చి, మరొకటి గుడ్ బ్యాడ్ అగ్లీ. ప్రస్తుతం విడా ముయార్చి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను జూన్ లో ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కకపోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను తాజాగానే అనౌన్స్ చేశారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతేడాది “తునివు” మూవీతో వచ్చి హిట్ అందుకున్న అజిత్ ఇప్పుడు ఈ రెండు తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు