Prabhas: “కల్కి” షూటింగ్ లో మటన్… ప్రభాస్ పై బాలీవుడ్ క్రిటిక్ కాంట్రవర్షియల్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “కల్కి” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ కాంట్రవర్షియల్ బాలీవుడ్ క్రిటిక్ “కల్కి” సినిమా షూటింగ్ లో ప్రభాస్ మాంసాహారం తింటున్నాడంటూ వివాదాస్పద ట్వీట్ చేసి రెబల్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఈ కొత్త వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది? అనే వివరాల్లోకి వెళ్తే…

“కల్కి” సెట్ లో మాంసాహారం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి” అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే విష్ణుమూర్తిగా, శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా, కల్కి అవతారంలో కూడా ప్రభాస్ ఈ సినిమాలో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లోక్ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే “కల్కి” మూవీ గురించి సంచలన కామెంట్స్ చేశాడు బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కేఆర్కే. ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమా చేసి రాముడిని నవ్వులపాలు చేశాడని, ఇప్పుడేమో విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి మూవీ చేస్తున్నాడని మండిపడ్డారు. అయితే తనకు అందిన సమాచారం ప్రకారం కల్కి సెట్స్ లో ప్రభాస్ ప్రతిరోజూ మాంసాహారం తింటున్నాడని, శ్రీమహావిష్ణువు పాత్రను పోషిస్తున్నప్పుడు ఇలా మాంసాహారం తినడం ఎంత వరకు కరెక్ట్? అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు కమాల్ ఆర్ ఖాన్.

కావాలనే నెగిటివిటీ….?
ప్రభాస్ భోజన ప్రియుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆయన “కల్కి” మూవీ సెట్ లో మాంసాహారం తిన్నాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ కేఆర్కే కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇతను బాలీవుడ్ లో కూడా ఇలాగే పలువురు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని చీప్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇక కేఆర్కే ట్వీట్ చూసాక బాలీవుడ్ లోని కొంతమంది కావాలనే ప్రభాస్ పై ఇలా నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. నిజానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం బాలీవుడ్ లో పలువురు సో కాల్డ్ సెలబ్రిటీలకు నచ్చట్లేదని, ఎలాగైనా ప్రభాస్ ను తొక్కేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. రీసెంట్ గా సలార్ మూవీకి రిలీజ్ టైంలో నార్త్ లో సరైన థియేటర్లు దక్కలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. షారుక్ డంకీ, ప్రభాస్ సలార్ కు మధ్య క్లాష్ రాగా, ఏషియన్ థియేటర్లలో కూడా సలార్ మూవీకి సరైన షోలు కేటాయించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ సలార్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడేమో కల్కి మూవీతో పాన్ ఇండియా ఇప్పుడేమో కల్కి మూవీతో పాన్ వరల్డ్ స్టార్ కాబోతున్న ప్రభాస్ ఫేమ్ చూసి అసూయతోనే ఆయనను డీఫేమ్ చేయాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసి ఒక వర్గం ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీస్తే ప్రభాస్ ఇమేజ్ ను దెబ్బతీసినట్టేనని భావిస్తున్నారని అంటున్నారు. కానీ వాళ్ల ఏడుపులే ప్రభాస్ కు ఆశీర్వాదంగా మారి మరింత ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు