Rama Banam: అనుకున్నదే అయ్యింది – బాణం తుప్పు పట్టింది..!

గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన రామబాణం సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్ కి హిట్ కీలకమైన దశలో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కథలో కొత్తదనం లోపించిందని టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి క్యారెక్టర్ కి కథలో ఏ మాత్రం ప్రాధాన్యత లేదని అంటున్నారు. పాత కథకి ఆర్గానిక్ వ్యవసాయం అన్న అంశం జోడించి ప్రేక్షకుడ్ని మభ్య పెట్టాలని చుసిన డైరెక్టర్ ప్రయత్నం బెడిసికొట్టిందని అంటున్నారు.

ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండటం వల్ల ప్రతి ఫ్రెమ్ అందంగా కనపడింది కానీ, ఈ సినిమా కథలో ప్రేక్షకుడ్ని కనెక్ట్ చేసే ఒక్క ఎలిమెంట్ కూడా లేదని అంటున్నారు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న గోపీచంద్ ఖాతాలో మరొక డిజాస్టర్ పడ్డట్టే అని అంటున్నారు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ ల కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం,లౌక్యం సినిమాలతో పోలిస్తే రామబాణం ఏ కోశానా ఆకట్టుకోదని అంటున్నారు. లక్ష్యం లాంటి ఎంగేజింగ్ కథ కానీ, లౌక్యం సినిమాలో లాంటి రిలీఫ్ ఇచ్చే కామెడీ కూడా లేకపోవటం వల్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది రామబాణం.

కథ పాతదే అయినప్పటికీ కథనం కొత్తగా ఉంటే, ప్రేక్షకులను కనెక్ట్ చేసే ఎమోషన్ ఉంటే సినిమా కచ్చితంగా అలరిస్తుంది. మొత్తానికి గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రామబాణం సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని స్పష్టం అవుతోంది. మరి, గోపీచంద్ నెక్స్ట్ ఎలాంటి కథతో రానున్నాడు, ఈసారైనా హిట్ అందుకొని ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు