Power Star: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఎప్పుడంటే..?

రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ సముద్రఖని డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదాయ సీతాం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ప్రారంభమైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య విడుదలైన ప్రీలుక్ పోస్టర్ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ మే 11న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ తెలిపింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు మే 11 ఒక స్పెషల్ డేట్. ఎందుకంటే 2012లో అదే డేట్ కి గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేయాలనీ సినిమా యూనిట్ డిసైడ్ అయ్యింది.

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలిజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 11 లాంటి మ్యాజికల్ డేట్ న రిలీజ్ అవుతున్న ఉస్తాద్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఎలా ఉండనుంది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు