Ugram: ఉగ్రం సినిమాకి అదే పెద్ద మైనస్ అయ్యిందా..?

అల్లరి నరేష్ కామెడీ సినిమాలకు స్వస్తి చెప్పి వరుసగా సీరియస్ కథాంశం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో నరేష్ హీరోగా రూపొందిన ఉగ్రం సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ బ్యాక్డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. నరేష్ నటనకు ప్రశంసలు అందుతున్నప్పటికీ సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా లేకపోవటం వల్ల సినిమా మీద మొదట్లో ఉన్న ఆసక్తి చివరి వరకు లేదని అంటున్నారు.

జానర్ ఏదైనా కానీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నప్పుడు చాలా గ్రిప్పింగ్ సీన్స్ రాసుకోవాలి. దర్శకుడు విజయ్ కనకమేడల ఉగ్రం విషయంలో ఆ పాయింట్ మిస్ అయ్యాడని అనిపిస్తోంది. యాక్షన్ సీన్స్ ఎంత ఇంట్రస్టింగ్ గా ఉన్నా కానీ, ఎమోషనల్ కనెక్షన్ లేని ఫ్లాష్ బ్యాక్, సీరియస్ గా సాగే కథలో ఎక్కడా రిలీఫ్ లేకపోవటం సినిమాకు మైనస్ అయ్యిందని అంటున్నారు.

హీరో నరేష్ మినహా ఏ పాజిటివ్ ఎలిమెంట్ లేని ఈ సినిమాకి ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ అయినప్పటికీ కథలో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవటం వల్ల ఆ అంచనాలు అందుకోలేకపోయిందని చెప్పాలి. ఉగ్రం సినిమాతో పాటు రిలీజ్ అయిన గోపిచంద్ రామబాణం సినిమాకి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. రామబాణం సినిమా కథలో కొత్తదనం లేదని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఉగ్రం సినిమాకు ప్రేక్షకులు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, మే 12న నాగచైతన్య కస్టడీ సినిమా విడుదలవుతుంది కాబట్టి ఉగ్రం సినిమాకి తోలి వారం కీలకం అని చెప్పాలి. ఈ క్రమంలో ఉగ్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు