టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో 152వ సినిమా ఆచార్య తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో మెగా స్టార్ చిరంజీవి తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ మెగా మల్టీ స్టారర్ నక్సలిజం, ధర్మం నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా మూవీపై రోజు రోజుకు భారీగానే పెరుగుతున్నాయి. కాగ ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానుంది.
అయితే ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ కొరటాల శివ ముందుగా మెగా స్టార్ కోసమే సిద్ధం చేశాడు. రామ్ చరణ్ ఈ మూవీలోకి కొణదెల ప్రొడక్షన్ కంపెనీతో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాగూ వచ్చాడని రామ్ చరణ్ కు మెగాస్టార్ ఓ గెస్ట్ రోల్ ను ఇప్పించాడు. ఆ రోల్ అలా.. పెంచుతూ.. సెకండాఫ్ మొత్తం కనిపించేలా అయింది. అయితే రామ్ చరణ్ పాత్ర నిడిపి పెరగడానికి కారణం.. చిరంజీవే అని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Read More: Vaishnavi Chaitanya’s Baby: బేబీ ఓటీటీ వర్షన్ వేరే లెవెల్ లో ఉండబోతుందా..?
రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేసి, తన కంటే.. సిద్ధ పాత్రపైనే ఫోకస్ పెట్టేలా.. చేశారట. దీంతో కొరటాల అసలైన స్క్రిప్ట్ పలు సార్లు మార్చాల్సి వచ్చిందట. తాను అనుకున్న స్టోరీ కాకుండా.. చిరంజీవి అనుకున్న మార్పులతో అవుట్ పుట్ వచ్చిందని డైరెక్టర్ కూడా అసంతృప్తిలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కోసం చిరంజీవి చేసిన త్యాగం వర్కౌట్ అవుతుందా.. లేదా బెడిసి కొడుతుందా.. అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Read More: Kalyan Ram’s Devil: రిలీజ్ డేట్ పై నో క్లారిటీ – డెవిల్ కి కొత్త చిక్కులు..!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...