టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగర్జున ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పేరు. ఆయన సినిమాలతో ఎంతో మంది ఫ్యాన్స్ ను దక్కించుకున్నారు. కాగ ఆయన హీరోగా 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఏకంగా రూ. 85 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ సక్సస్ కావడంతో బంగర్రాజు పేరుతో సీక్వెల్ కూడా చేశాడు.
అయితే బంగార్రాజు మూవీలో తన డబుల్ రోల్స్ కు కోతలు పెట్టి.. కొడుకు నాగ చైతన్యకు అవకాశం ఇచ్చాడు. గెస్ట్ రోల్ గానే అనుకుని చివరికీ మెయిన్ హీరోగా చూపించాడు. అయితే నాగ్ త్యాగం వర్కౌట్ కాలేదు. యావరేజ్ టాక్ ను మాత్రమే తెచ్చుకుంది. ఒక వేళ నాగర్జునే ఈ మూవీని పూర్తి చేస్తే.. ఫలితం మరోలా ఉండేదని క్రిటిక్స్ బహిరంగంగానే చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం మెగా స్టార్ కూడా ముందుగా అనుకున్న స్టోరీని పక్కన పెట్టి.. తన కుమారుడు రామ్ చరణ్ పైనే ఫోకస్ పెట్టి కథలో మార్పులు చేశాడు. గెస్ట్ రోల్ ను ఫుల్ లెన్త్ రోల్ గా మార్చాడు. స్టోరీ మొత్తం మారిపోయిందని తెలుస్తుంది. దీంతో మెగా స్టార్ కు కూడా నాగర్జున కు ఎదురైన అనుభవమే.. వస్తుందని సినీ విమర్శకులు అంటున్నారు. అయితే ఇప్పుడు బంగర్రాజు సీన్ రిపీట్ అవుతుందా.. లేదా మెగా తండ్రీ కొడుకులు రికార్డులు సృష్టిస్తారా.. అని రేపటి సినిమాతో తేలిపోతుంది.