ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం.. ఇది ఫిక్స్..!

వ‌రుస‌గా నాలుగు హిట్స్ అందుకున్న కొర‌టాల శివ లేటెస్ట్ గా మెగా స్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ తో ఆచార్య తీసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రేపు వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్న ఈ సినిమా బ్లాక్ బస్ట‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌నే తెలుస్తుంది. దీంతో కొర‌టాల శివ కెరీర్ లో వ‌రుసగా ఐదో హిట్ చేరినట్టే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అప్పుడే టాక్ న‌డుస్తుంది.

కాగ ఆచార్య త‌ర్వాత‌ కొర‌టాల శివ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్ర‌క‌టించాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేని స్టోరీని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కొర‌టాల వెల్లడించాడు. అతి త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ తో సినిమా పట్టాల‌ను ఎక్కిస్తున్నట్టు కూడా తెలిపాడు. అయితే ఈ
సినిమా స్టార్ట్ కాక ముందే.. కొర‌టాల శివ త‌ర్వాతి సినిమా గురించి సోష‌ల్ మీడియాలో ఒక వార్త తెగ చెక్క‌ర్లు కొడుతుంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఒక ప‌వ‌ర్ ఫుల్ పొలిటికల్ స్టోరీని కొర‌టాల సిద్ధం చేశాడ‌ట. తాను డైరెక్ట‌ర్ కాక‌ముందే.. ప‌వ‌న్ కోసం ఈ స్టోరీని రెడీ చేశాడ‌ట‌. ఈ సినిమాలో ప‌వ‌న్ ను సీఎంగా చూపించాల‌ని కొర‌టాల ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ స్టార్ ను క‌లిసి ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయ‌డానికి కొర‌టాల ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్ వ‌చ్చిన‌ట్టే.

- Advertisement -

కాగ గ‌తంలో కొర‌టాల సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును కూడా భ‌ర‌త్ అనే నేను సినిమాలో సీఎం గా చూపించాడు. ఈ మూవీ సూప‌ర్ హిట్ అందుకుని.. ప్రిన్స్ స్టార్ ఇమేజీని మ‌రింత పెంచింది. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా ఈ స్టోరీ క‌లిసోచ్చే అవ‌కాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు