సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. గీత గోవిందం ఫేమ్ పరుశరామ్ తో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ ఈ మూవీ వేసవి కానుకగా.. వచ్చే నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ కావాల్సిన హైప్ క్రియేట్ చేశాయి.
తాజా గా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు. వచ్చే నెల 2వ తేదీన ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ట్రైలర్ లో సూపర్ స్టార్ మాస్ ఎనర్జీ ఫ్యాన్స్ కు పూనకాలే. ఈ ట్రైలర్ తో సర్కారు వారి పాటపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.