రామ‌సేతు : ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్.. మెయిన్ రోల్ లో రామ సేతు మూవీ వ‌స్తున్న‌ట్టు అనౌన్స్ వ‌చ్చింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుంచి ఒక్క పోస్ట‌ర్ కూడా బ‌య‌ట‌కు కాలేదు. తాజా గా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ ను అఫీషియ‌ల్ గా రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో బాలీవుడ్ హీరో అక్ష‌య కుమార్, టాలీవుడ్ హీరో స‌త్య‌దేవ్, జక్వెలిన్ ఫెర్నాండ‌జ్ ముగ్గురు ఉన్నారు. టార్చ్ లైట్స్ తో సెర్చ్ చేస్తున్న‌ట్టు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతుంది.

కాగ ఈ రామ సేత్ సినిమాను కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కూడా కో ప్రొడ్యూస‌ర్ గా ఉంది. కాగ ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఒర థియేట్రిక‌ల్ మూవీని ప్రొడ్యూస్ చేయ‌డం ఇదే మొద‌టి సారి.

ఈ మూవీలో రామాయణంలో ఉన్న రామసేతు బ్రిడ్జీ గురించే నిజా నిజాలు తెలుసుకునే పురావస్తు శాస్త్రవేత్త‌లు చేస్తున్న ప్ర‌య‌ణ‌మే ఈ రామ సేతు మూవీ. శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు