సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ ముందు బొక్క బోర్ల పడింది. దీంతో తన లీస్ట్ లో ఉన్న సలార్, ఆది పురుష్ తో పాటు మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ మూవీని కూడా త్వరగా పూర్తి చేయాలని డార్లింగ్ చూస్తుండు. అయితే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చేయాలనే ఉద్దేశంతో రెబల్ స్టార్.. మారుతి డైరెక్షన్ లో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సలార్, ఆది పురుష్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రాజా డీలక్స్ స్మాల్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగ ప్రస్తుతం రాజా డీలక్స్ నుంచి మరో వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రూ. 5 కోట్లతో ఒక భారీ ఇంటి సెట్ ను డిజైన్ చేస్తున్నారట. ఈ ఇంటిలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందట. అతి త్వరలోనే ఈ సెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి షూటింగ్ ప్రారంభిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.