కరోనా మహమ్మారి తర్వాత థియేటర్స్ మూత పడటం తో పాటు ఇతర సమస్యల వల్ల సినీ లవర్స్ ఓటీటీ బాట పట్టారు. దీన్ని ఓటీటీలు కూడా క్యాష్ చేసుకోవడానికి తీవ్ర పయత్రాలే చేస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళం తో పాటు ఇతర భాషాల్లో స్టార్ హీరోలతో విభిన్నమైన స్టోరీలతో వెబ్ సిరీస్ లు తీస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో మరింత దూకుడగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే అమెజాన్ నుంచి మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. వీటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్నీ వెబ్ సిరీస్ లను అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తుంది.
రాబోయే రెండేళ్లలో అన్ని భాషాల్లో కలిపి మొత్తం 40 వెబ్ సిరీస్, సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసింది. అందులో 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్ సిరీస్ లు, 9 రిటర్నింగ్ సిరీస్ లు, 3 అమెజాన్ ఒరిజనల్ మూవీస్, 2 కో ప్రొడక్షన్స్ ఉన్నాయని తెలిపారు.
మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లతో పాటు పాతాళ్ లోక్, బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్, ముంబై డైరీస్, ఇండియన్ పోలీస్ ఫోర్స్, మోడర్న్ లవ్ హైదరాబాద్ ఉన్నాయని వెల్లడించారు. అలాగే అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చే దూత కూడా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఓటీటీ ఫాలోవర్స్ కు ఈ రెండేళ్లు వెబ్ సిరీస్ ల పండగే ఉంటుంది.