ఆచార్య మూవీ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అతని సినిమా రిలీజ్ అయితే సెలెబ్రేషన్ ఉంటుంది. జల్సా సినిమాలో త్రివిక్రమ్ రాసినట్లు చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ చాలా రేర్ గా దొరుకుతుంది. అలా రేర్ గా టికెట్ దొరికిన ప్రేక్షకుడికి చేదు అనుభవమే ఎదురైంది. వాస్తవంగా మాట్లాడితే సినిమాకు అంత హైప్ లేకపోయినా కొరటాల శివ లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా అంటే అభిమానులతో పాటు, ప్రేక్షకులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కొరటాల శివ ఎంతవరకు నిలబెట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

కథ:
ధర్మస్థలి అనే ప్రదేశంలో అధర్మం రాజ్యం ఏలుతున్న క్రమంలో ఆచార్య (చిరంజీవి) అక్కడకి వస్తాడు. ఎంతో ప్రసిద్ది గాంచిన ధర్మస్థలి అప్పటికే బసవ (సోనూసూద్‌) చేతుల్లోకి వెళ్ళిపోతుంది. బసవ మరియు అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా అరికట్టాడు? అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వచ్చాడు.? అసలు ఆచార్యకి ధర్మస్థలికి ఉన్న సంబంధం ఏమిటి? ధర్మస్థలి పక్కనే ఉన్న పాద ఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ద (రామ్‌ చరణ్‌) ఏమైపోయాడు? అసలు సిద్ధ ఎవరు? సిద్ధాకి ఆచార్యకి మధ్య ఉన్న బంధం ఏమిటి? చివరకు ఆచార్య ధర్మస్థలిలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:
ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటారు. అది మెగాస్టార్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఆరు పదులు దాటినా ఎప్పటికి అదే గ్రేస్, అదే స్టైల్ మేనేజ్ చెయ్యడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి అదే మేజిక్ , అదే ఫీలింగ్ రిపీట్ అయింది. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను తన శక్తీ మేరకు నిలబెట్టే ప్రయత్నం చేసారు. తనకు ఉన్న పరిధిలో నీలాంబరి పాత్రలో ఒదిగిపోయి నటించింది పూజ హేగ్దే. ఈ సినిమాకి సిద్ధ (రామ్ చరణ్ ) పాత్ర హైలెట్ అని చెప్పొచ్చు. చిరంజీవితో కలిసి కనిపించిన ప్రతి సీన్ లోను చరణ్ ఎక్కడ తగ్గకుండా నటించాడు అని చెప్పొచ్చు. శివ డిజైన్ చేసిన పాత్రకు సంపూర్ణ న్యాయం చేసి జీవం పోసాడు రామ్ చరణ్.

- Advertisement -

మైనస్ పాయింట్స్:
హై వచ్చే సీన్స్ లేకపోవడం. ప్రేక్షకుల నాడీ తెలిసిన డైరెక్టర్స్ కొందరు ఉంటారు. అందులో కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమాలో “ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క” అని ప్రభాస్ చెప్పినప్పుడు.. శ్రీమంతుడు సినిమాలో “ఊరును దత్తత తీసుకోవడం అంటే రోడ్లు,రంగులు వేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా” అని మహేష్ చెప్పినప్పుడు… “అనగనగా ఒక ఆఫీస్ ఆ ఆఫీస్ లో ఒక వికాస్” అని జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ చెప్పినప్పుడు ఆడియన్స్ అందరికి ఒక హై ఫీలింగ్ వచ్చింది. అటువంటి సీన్స్ ఈ సినిమాలో లేకపోవడం మైనస్. ఒకే ఇస్యూ ను ఎక్కువ పాత్రలతో సాగదీసి చెప్పిన ఫీలింగ్ కలిగించింది ఈ ఆచార్య సినిమా. ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్ అదే విధంగా ముందుగానే అర్ధమయ్యే కొన్ని సన్నివేశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా పరిగణించవచ్చు.
కొరటాల శివ లాంటి డైరెక్టర్ కి ఒక చీరంజీవి అంతటి స్టార్ హీరో తో పాటు రామ్ చరణ్ లాంటి హీరో దొరికితే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడు అని చెప్పొచ్చు.

మొత్తంగా చెప్పాలంటే కొంచెం ఓపిక తో చూడాల్సిన ఒక మాములు పాతతరం సినిమా అనొచ్చు.

రేటింగ్ : 2.5/ 5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు