మెగా కంపౌండ్ లో హీరోలు ఎన్ని హిట్స్ కొట్టారో.. అన్ని ప్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే ప్లాప్స్ ను అంగీకరించడంలో మెగా హీరోల తర్వాతే.. ఎవరైనా. వాళ్లు చేసిన సినిమా నెగెటివ్ టాక్ వస్తే.. ఓపెన్ గా ప్లాప్ అయిందంటూ.. అభిమానులు క్షమించాలని స్టేట్‌మెంట్ ఇచ్చేస్తారు. ఈ సంప్రదాయాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మినహా మెగా కంపౌండ్ లోని హీరోలు అందరూ పాటిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2019 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ యాక్షన్ డ్రామా మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే.. నెగెటివ్ టాక్ తెచ్చుకుని చివరికి బిగ్ డిజాస్టార్ గా మిగిలింది. వెంటనే రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ కు బహిరంగ లేఖ రాశారు. మూవీ ప్లాప్ అయినందుకు క్షమించాలని కోరాడు. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని మూవీ కూడా అంచనాలను అందుకోలేదు. రోటీన్ స్పోర్ట్స్ డ్రామా గా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మీడియా ముందే.. దీన్ని అంగీకరించి ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు.
అయితే ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ ఆచార్య మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంటుంది. అంచనాలను అందుకోవడంలో ఈ మెగా తండ్రీ కొడుకులు విఫలం అయ్యారని క్రిటిక్స్ బహిరంగంగానే చెబుతున్నారు. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ కూడా అసంతృప్తి గానే ఉన్నారనేది అంగీకరించాల్సిన సత్యం.
అయితే మెగా కంపౌండ్ సంప్రదాయాన్ని పాటిస్తూ… ఈ మూవీ ప్లాప్ అయిందని అంగీకరించడానికి ఎవరూ ముందుకు వస్తారని సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. మళ్లీ రామ్ చరణ్ లేఖ రాస్తాడా..? లేదా.. స్వయంగా మెగా స్టార్ రంగంలోకి దిగి అభిమానులకు క్షమాపణలు చెబుతారా..? అని తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.