Pawan kalyan: “బ్రో”లో ఈ భామ కూడా? నిజమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో “బ్రో” అనే సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇందులో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న పవన్ కళ్యాణ్ దేవుడిపాత్రలో మరో సరి అలరించనున్నాడు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో కూడా కృష్ణుడిగా గాడ్ క్యారెక్టర్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అలాంటి పాత్రతో వస్తుండడంతో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ హైప్ వచ్చింది.

ఇప్పటికే టాకీ పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉంది. అయితే ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా ఒక పాత్ర చేసినట్టు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ రోల్ సినిమాలో కీలకపాత్ర అని, గెస్ట్ అప్పీరెన్స్ లాగా ఉండే ఆ పాత్ర కథలోని పలు మార్పులు తెస్తుందని సమాచారం. ఈ సినిమాను తమిళ్ హిట్ వినోదయ సితం కి రీమేక్ గానే తెరకెక్కుతున్నా, తెలుగులో మాత్రం ఈ సినిమాకు చాలా మార్పులు చేసారని తెలుస్తుంది. పైగా ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే కేతిక శర్మ, ప్రియా వారియర్ నటించిన విషయం తెలిసిందే.

అయితే సంయుక్త కీలక పాత్రప్లే చేస్తుందన్న ఈ వార్త నిజమో కాదో ఇంకా తెలియదు. కానీ సినిమాలో చాలా మార్పులు చేయడం వల్ల ఈ పాత్రను కొత్తగా సృష్టించి ఉండవచ్చు అని నెటిజన్లు అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమో కాదో చిత్ర యూనిటే క్లారిటీ ఇవ్వాలి. అయితే సంయుక్త మాత్రం విరూపాక్ష తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా కనిపించట్లేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు